మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ :
సర్ప్ స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక పెన్షనర్స్ భవన్లో సంస్థ అధ్యక్షురాలు డా. బీ. ప్రమీల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి విజయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 సంవత్సరంలో సంస్థ అమలు చేసిన కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోచంపల్లి మండలంలోని గ్రామాలలో మహిళలపై గృహహింస నివారణకు చేపట్టిన అవగాహన, శిక్షణ, సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. భువనగిరి మండలంలోని 6 గ్రామాలలో మహిళలు, బాలికల కోసం జెండర్ జస్టిస్ కార్యక్రమాల అమలు, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలతో పాఠశాలలు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, సఖి సేవల సమన్వయం, అలాగే పట్టణ ప్రాంతాలలో రాత్రి ఆశ్రయం లేని నిరాశ్రయులకు అర్బన్ నైట్ షెల్టర్ సేవలు చేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ, మహిళలు మరియు పిల్లల సాధికారత, లింగ సమానత్వం, సామాజిక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమానికి పీస్ ఎన్జీఓ అధ్యక్షులు కే. నిమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై సంస్థ సేవలను అభినందించగా రిటైర్డ్ ఎమ్మార్వో మోహన్ రెడ్డి, సర్ప్ సంస్థ వ్యవస్థాపకులు బీ. సుదర్శన్, బీ. రామచంద్రయ్య, సంస్థ పాలక మండలి సభ్యులు, సాధారణ సభ్యులు పాల్గొన్నారు.